బీఆర్ఎస్​కు ప్రైవేట్​టీచర్స్ ​ఫోరం మద్దతు

బీఆర్ఎస్​కు ప్రైవేట్​టీచర్స్ ​ఫోరం మద్దతు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రైవేట్​టీచర్స్​ఫోరం (టీపీటీఎఫ్) నాయకులు.. ఎన్నికల్లో బీఆర్ఎస్​కు మద్దతు ప్రకటించారు. సోమవారం ఫోరం నేతలు బేగంపేట క్యాంపు ఆఫీస్​లో బీఆర్ఎస్​వర్కింగ్ ​ప్రెసిడెంట్ ​కేటీఆర్​తో సమావేశమయ్యారు. ప్రైవేట్​ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని స్కూళ్లల్లో పని చేసే టీచర్లకు పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని కోరారు. 12 నెలల జీతం, ప్రభుత్వం ప్రకటించిన అన్ని సెలవులు అమలయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు హెల్త్​కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల్లో తమకు మద్దతునిచ్చినందుకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఫోరం అధ్యక్షుడు షేక్​షబ్బీర్​అలీ, నేతలు శివరాజ్, నిరుపమ, నవీన్​, రేణుక, అమీరుద్దీన్, సుబ్బలక్ష్మీ, భాస్కర్, అఫ్జల్ ఉన్నారు.

 
 

Leaders of Telangana Private Teachers Forum (TPTF) have announced their support for BRS in the elections.