కాంగ్రెస్​లోకి జగిత్యాల బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సంజయ్​

కాంగ్రెస్​లోకి జగిత్యాల బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సంజయ్​

హైదరాబాద్, వెలుగు: జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్​లో చేరారు. ఆదివారం రాత్రి తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి.. సంజయ్ కుమార్​కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంజయ్ జగిత్యాల నుంచి రెండోసారి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్​రెడ్డిపై 15,822 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పటికే కాంగ్రెస్​లో బీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరారు. 

ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిశారు. మరోవైపు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​తో పాటు ఉమ్మడి మెదక్​కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు గతంలో సీఎంను కలిశారు. ఎమ్మెల్యే సంజయ్ జాయినింగ్ పోగ్రాంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బోదన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.