
రంగారెడ్డి జిల్లా గండిపేటలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా గురైంది. బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9 ఎకరాల 36 గుంటల భూమిని బీఆర్ఎస్ పార్టీ లీడర్ కబ్జా చేసినట్టు సమాచారం. కబ్జా చేసిన భూములకు పట్టా పాస్ బుక్కులు సంపాదించినట్టు తెలుస్తుంది. అప్పటి బీఆర్ఎస్ మంత్రి సహకారంతో కలెక్టర్ ను ప్రభావితం చేసి అడ్డదారిన పట్టా పాస్ బుక్కులు పొందినట్టు సమాచారం.
కబ్జా చేసిన కోట్ల రూపాయల విలువ చేసే భూమిని గండిపేట తహశీల్దార్ కాపాడారని స్థానికులు గుసగుసలాడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ అధికారులు జేసీబీ సహాయంతో ప్రహరీ గోడను నేలమట్టం చేశారు. అడ్డదారిని సంపాదించిన పట్టా పాస్ బుక్కులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శషాంకా క్యాన్సెల్ చేశారు. దీనిపై విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు రెవెన్యూ అధికారులు.