గులాబీ జెండా ఎగరడం ఖాయం : ఫారుక్ హుస్సేన్

గులాబీ జెండా ఎగరడం ఖాయం :  ఫారుక్ హుస్సేన్

జోగిపేట, వెలుగు :  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్​ నియోజకవర్గంలో  గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్‌‌ఎస్​ నేత ఫారుక్  హుస్సేన్ అన్నారు. సోమవారం పట్టణంలో పార్టీ కార్యాలయం ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, పార్టీని నడిపించేది వారే అన్నారు.  ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, టీఎస్ టీపీసీ చైర్మన్​భిక్షపతి మాట్లాడుతూ ఆందోల్​లో బీఆర్ఎస్‌కు పోటీ లేదన్నారు.

కేవలం మెజార్టీ కోసమే కష్టపడాలన్నారు. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని, భేదాభిప్రాయాలు పక్కనపెట్టి పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. అనంతరం వెంకట కిష్టాపూర్, వెంకట్రావుపేట గ్రామాల చెందిన పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సంజీవయ్య, విజయలక్ష్మి , రాహుల్ కిరణ్, జగన్ మోహన్ రెడ్డి, రజినీకాంత్, బాలయ్య, మహేశ్వర్ రెడ్డి, మల్లయ్య, ప్రవీణ్, అశోక్, లక్ష్మీకాంతరెడ్డి, విజయ్ కుమార్, శివకుమార్, వీరప్ప, గోపాల్ రావు, నర్సింలు, శివ శేఖర్, లింగా గౌడ్, వెంకటేశం, శ్రీధర్, నాగరాజు, నరసింహారెడ్డి, ముక్తార్ పాల్గొన్నారు.