అసత్య ఆరోపణల్లో హరీశ్రావు దిట్ట ..స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

అసత్య ఆరోపణల్లో హరీశ్రావు దిట్ట ..స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, వెలుగు: ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో హరీశ్​రావు దిట్ట అని స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. జనగామ జిల్లా చిల్పూర్​ మండలంలోని పల్లగుట్టలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు అమలు కావాలంటే 9వ షెడ్యూల్​లో చేర్చితేనే సాధ్యమన్నారు. బీజేపీకి బీసీలపై ప్రేమ ఉంటే ఆ పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి  పంపిందని, మోదీకి ఇష్టంలేకనే పట్టించుకోలేదని ఆరోపించారు. వారిపై వచ్చేఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే హరీశ్​రావు, కేటీఆర్​ కాంగ్రెస్​పై విమర్శలకు  దిగుతున్నారని అన్నారు. మందుగా కవిత ఆరోపణలకు హరీశ్​రావు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ అభ్యర్థులను గెలుపించుకుంటేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. పంచాయతీ ఎన్నిక తరువాత అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. చిల్పూర్​ ఆలయ కమిటీ చైర్మన్​ పొట్లపల్లి శ్రీధర్, మండల నాయకులు పాల్గొన్నారు.