- సొంత డబ్బులతో ఇప్పిస్తానన్న బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ నియోజకవర్గంలోని 3 వేల మంది ఆటో డ్రైవర్లకు తన సొంత ఖర్చులతో ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్ తెలిపారు. సోమవారం ఖానాపూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పాల్గొని జాన్సన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. కేసీఆర్ పాలనలో ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా ఉండేదని, కాంగ్రెస్ వచ్చాక ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసిందన్నారు.
త్వరలోనే ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా బాండ్స్ ను పంపిణీ చేస్తామని ప్రకటించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నల్లా శ్రీనివాస్, నాయకులు డాక్టర్ కేహెచ్ ఖాన్, రాజ గంగన్న, రాజు, శ్రీనివాస్, సుమిత్, శ్రావణ్, దివాకర్, నసీర్, మెహరాజ్, షోయబ్ తదితరులు పాల్గొన్నారు.
