ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ: కవిత

ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ: కవిత

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తొమ్మిది రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు.  సీబీఐ తరుపు లాయర్ వాదనలతో ఏకీభవించిన  కోర్టు కవితకు ఏప్రిల్ 23వ వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. అనంతరం కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాద.. బీజేపీ కస్టడీ అని మండిపడ్డారు. బయట బీజేపీ వాళ్లు అడిగేదే లోపల సీబీఐ అధికారులు అడుగుతున్నారని చెప్పారు. కొత్తగా అడగడానికి ఏం లేక.. రెండేళ్లుగా అడిగిందే మళ్లీ మళ్లీ అడుతున్నారని ఆమె తెలిపారు.

గత శుక్రవారం కోర్టు అనుమతితో అరెస్టు చేసి తీహార్ జైలు నుంచి మూడు రోజుల కస్టడీకి తీసుకుని కవితను విచారించింది సీబీఐ. సోమవారంతో సీబీఐ కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపర్చారు. అడిగిన ప్రశ్నలకు కవిత సూటిగా సమాధానాలు చెప్పడం లేదని, మూడు రోజుల కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఆమెను ఇంకా విచారించాల్సిన ఉందని.. అందుకు14 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది సీబీఐ.