బండి సంజయ్ ఏమన్నారు.. BRS ఆందోళన ఎందుకంటే..

బండి సంజయ్ ఏమన్నారు..  BRS ఆందోళన ఎందుకంటే..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల్లో ఉన్నోళ్లను అరెస్ట్ చేయకుంటే.. ముద్దు పెట్టుకుంటారా ఏంటీ అంటూ ఆయన వ్యాఖ్యలపై రాద్దాంతం చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్స్. బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచే విధంగా  బండి సంజయ్ ఉన్నాయంటూ పోలీస్ స్టేషన్లలో కంప్లయింట్స్ ఇస్తున్నారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కవితను అరెస్ట్ చేస్తారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు.. తప్పుచేసినోళ్లను అరెస్ట్ చేయకుండా.. ముద్దు పెట్టుకుంటారా అంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపైనే.. బీఆర్ఎస్ పార్టీ  ఆందోళనలు చేస్తున్నారు.

బండి సంజయ్ క్షమాపణ చెప్పాలె: మల్లారెడ్డి

కవితపై వ్యాఖ్యలు చేసినందుకు  బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు ఇలాంటి కుసంస్కార వ్యాఖ్యలు చేస్తే రాష్ట్రంలో తిరగనియ్యబోమని హెచ్చరించారు. బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.

కవిత జోలికొస్తే రాష్ట్రం అట్టుడికిపోతది: తలసాని

ఎమ్మెల్సీ కవిత జోలికొస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరోలా చూస్తారంటూ హెచ్చరించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీజేపీ లీడర్స్ ఇష్టానుసారంగా మాట్లాడితే హైదరాబాద్ లో తిరగనియ్యబోమని వార్నింగ్ ఇచ్చారాయన. కవిత వెంట తామంతా ఉన్నామన్నారు.

కేసీఆర్ ను ఎదుర్కోలేక అక్రమ కేసులు: దానం నాగేందర్

కేసీఆర్ ను  రాజకీయంగా ఎదుర్కోలేకనే  ప్రధాని మోడీ అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. కావాలనే మోడీ కవితపై కేసులుపెట్టిస్తున్నారన్నారు. ఈడీ, సీబీఐలను మోడీ వాడుకుంటున్నాడని ఆరోపించారు.

 దేశంలో తిరగనివ్వొద్దు:  ఎమ్మెల్యే వివేకానంద

ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు.. ఎంపీ బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే  వివేకానంద. కుత్బుల్లాపూర్ లోని ఐడీపీఎల్  చౌరస్తాలో నిరసన తెలిపారు  బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంటే.. పదవిలో ఉన్న ఒక మహిళా నాయకురాలిపై.. ఎంపీ బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడటం తగదన్నారు. ఇలాంటి వారిని దేశంలో తిరగనివ్వొద్దన్నారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు.  

బండి సంజయ్ ది నరంలేని నాలుక: మైనంపల్లి 

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా  బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ది నరం లేని నాలుకని.. కవిత ఏ తప్పు చేయలేదని.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 90 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మైనంపల్లి.