డోర్నకల్ ​బీజేపీ అభ్యర్థిపై బీఆర్ఎస్ నేతల దాడి

డోర్నకల్ ​బీజేపీ అభ్యర్థిపై బీఆర్ఎస్ నేతల దాడి

నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం గోపతండా అనుబంధ గ్రామమైన లావుడ్యతండాలో డోర్నకల్ బీజేపీ అభ్యర్థి భూక్య సంగీతపై బీఆర్ఎస్ లీడర్లు దాడిచేశారు. సోమవారం ఉదయం లవుడ్యాతండాలో ప్రచారానికి వెళ్లిన ఆమెను సర్పంచ్ భర్త, బీఆర్ఎస్​మద్దతుదారులు అడ్డుకున్నారు. సంగీత డ్యాన్స్ చేస్తుండగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. తనకు ప్రచారం చేసుకునే హక్కు ఉందని సంగీత చెప్పగా, దాడి చేశారు.

ఇరుపార్టీల శ్రేణులు ఘర్షణ పడ్డారు. అనంతరం సంగీత మీడియాతో మాట్లాడుతూ.. సర్పంచ్, సర్పంచ్ భర్త, మరో ముగ్గురు కలసి తనపై దాడి చేశారని తెలిపారు. బూతులు తిడుతూ వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారన్నారు. బీఆర్ఎస్ జడ్పీటీసీగా గెలిచిన తనను ఎమ్మెల్యే రెడ్యానాయక్ గుర్తించకపోవడంతోనే బీజేపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నట్లు చెప్పారు. అది చూసి ఓర్వలేని బీఆర్ఎస్ లీడర్లు తనపై దాడిచేశారని వాపోయారు. ప్రచార వాహనాలకు దారి ఇవ్వాలని అనడంతోనే తమపై దాడి చేశారని, తాము ఎవరిపై దాడి చేయలేదన్నారు.

 ALSO READ : అఫిడవిట్లు సక్కగలేవు.. బీఆర్ఎస్ ​లీడర్ల నామినేషన్లు తిరస్కరించాలె: అపొజిషన్