జీడిమెట్ల, వెలుగు : బీఆర్ఎస్ నేతలను పేకాట ఆడుతుండగా బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి నిజాంపేట్ మెయిన్ రోడ్డులోని జేఎస్ఎన్ బిల్డింగ్ సెల్లార్ లో కొంతకాలంగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సోమవారం రాత్రి పోలీసులు దాడులు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద రూ.41వేల నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితుల్లో నిజాంపేట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ కార్పొరేటర్, మరో కార్పొరేటర్ భర్త ఉన్నారు.
