ఆ మూడు చోట్ల..ఖాతా తెరువలే

ఆ మూడు చోట్ల..ఖాతా తెరువలే
  • నల్గొండ, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌, మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి       సెగ్మెంట్లలో బీఆర్​ఎస్​కు దొరకని ఎంట్రీ
  • ఈసారి కూడా కష్టంగానే కనిపిస్తున్న పరిస్థితులు
  • గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేల బలమున్నా విజయంపై నీలినీడలు
  • కాంగ్రెస్​ గూటికి చేరుతున్న కీలక నేతలు

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ 23 ఏండ్ల చరిత్రలో నల్గొండ, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌, మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి ఎంపీ స్థానాలు కొరకరాని కొయ్యగా మారాయి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌‌‌‌‌‌‌‌సభ సీట్లు ఉండగా.. 14 చోట్ల ఏదో ఒక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. కానీ, ఈ మూడు స్థానాల్లో మాత్రం కారు పార్టీకి ఎంట్రీ దొరకలేదు. కేసీఆర్ టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీని 2001లో ఏర్పాటు చేశారు. ఈ 23 ఏండ్లలో నాలుగు సార్లు లోక్​సభ ఎన్నికలు జరిగాయి. కానీ, నల్గొండ, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌, మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరిలో మాత్రం బీఆర్ఎస్ ఇంతవరకు గెలవలేకపోయింది. గడిచిన పదేండ్లు రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన సందర్భంలో కూడా ఈ మూడు స్థానాలపై బీఆర్ఎస్ పట్టు సాధించలేకపోయింది.

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లో పద్మారావుపైనే ఆశలు..

సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి గత నాలుగు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, బీజేపీ నుంచి ఒకసారి బండారు దత్తాత్రేయ, మరోసారి కిషన్ రెడ్డి గెలిచారు. ఇప్పడు మళ్లీ గెలిచేందుకు కిషన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2004లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తో పొత్తులో భాగంగా బీఆర్ఎస్‍‌‌‌‌‌‌‌‌కు పోటీ చేసే అవకాశం రాలేదు. 2009లో బీఆర్ఎస్ నుంచి ఎండీ మహమూద్ అలీ పోటీ చేసినా.. ఐదో స్థానానికి పరిమితం అయ్యారు. 2014లో టి. భీంసేన్ పోటీ చేస్తే.. నాలుగో స్థానంలో నిలిచారు. 2019లో పోటీ చేసిన తలసాని సాయి కిరణ్ యాదవ్ రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌కు పరిమితమయ్యారు. తాజా ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. పద్మారావు స్థానికంగా బలమున్న నేత కావడంతో ఆయనపైనే గులాబీ బాస్ ఆశలు పెట్టుకున్నారు.

నల్గొండలో ఎదురీత.. 

నల్గొండలో 2004 నుంచి జరిగిన ఎన్నికల్లో ఒకసారి సీపీఐ గెలవగా.. మూడు సార్లు కాంగ్రెస్ గెలిచింది. 2004లో సీపీఐ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి విజయం సాధించారు. 2009, 2014లో కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి గెలిచారు. 2004లో బీఆర్ఎస్ అభ్యర్థి వట్టిపల్లి శ్రీనివాస్​ గౌడ్ పోటీ చేయగా.. మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. దీంతో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. 2014లో పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేయగా.. ఆయన మూడోస్థానంలో నిలిచారు. 2019లో బీఆర్ఎస్ నుంచి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.

మల్కాజ్​గిరిలో కాంగ్రెస్​కు జోష్ 

2009లో జరిగిన డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా మల్కాజ్​గిరి నియోజకవర్గం ఏర్పడింది. అక్కడ ఇప్పటి వరకు మూడు సార్లు లోక్​సభ ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ రెండుసార్లు, టీడీపీ ఒకసారి గెలిచాయి. 2009లో ఈ స్థానంలో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. 2014లో మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ తరఫున ఇక్కడి నుంచి పోటీ చేయగా.. ఆయన రెండోస్థానంలో నిలిచారు. టీడీపీ నుంచి మల్లారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత మల్లారెడ్డి టీడీపీ నుంచి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో ఈ స్థానంలో బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎంపీగా పోటీ చేయగా.. ఆయనపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి విజయం సాధించారు. అయితే, ఇక్కడ ఈసారి మల్లారెడ్డిని గెలిపిస్తారని కేసీఆర్ ఆశలు పెట్టుకుంటే ఆయన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండడం కూడా కారు పార్టీపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో జోష్ వచ్చినట్టు అయింది.

ఈ సారీ అంతంత మాత్రంగానే పరిస్థితులు

ఈ మూడు నియోజకవర్గాల్లో ఈ సారి ఎలాగైనా బోణీ కొట్టాలని బీఆర్ఎస్ భావి స్తున్నా.. ప్రస్తుత పరిస్థితులు ఆ పార్టీకి అను కూలంగా లేవు. వాస్తవానికి సికింద్రాబాద్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని  బీఆర్ఎస్ గెలుచుకుంది. అలాగే, మల్కాజ్ గిరి పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించింది. ఈ క్రమంలో ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తామన్న ధీమాలో బీఆర్ఎస్ ఉన్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లోకి వెళ్లేందుకు మొగ్గుచుపు తున్నారు. ఇప్పటికే చాలామంది కీలక నేత లు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. మరికొంత మంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటు న్నారు. ఈ క్రమంలో ఎంపీ ఎన్నికల్లో క్షేత్రస్థా యిలో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎంత మేరకు సహ కరిస్తారన్నది ప్రశ్నేగానే కనిపిస్తోంది.