NMLలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు... జీతం రూ. 71 వేలు

NMLలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు... జీతం రూ. 71 వేలు

భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మైనింగ్ లిమిటెడ్ (ఎన్ఎంఎల్) ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లోని  కోల్ మైనింగ్ ప్రాజెక్ట్/ ఆఫీసుల్లో పనిచేయడానికి ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 15. 

  • పోస్టుల సంఖ్య: 21. 
  • పోస్టులు: ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్), ఎగ్జిక్యూటివ్ (ఎన్విరాన్​మెంట్ మేనేజ్​మెంట్) 03, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ 15. 
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సిటీ నుంచి డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఎస్సీ, ఎంటెక్, సీఏ/ సీఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
  • జీతం: రూ.60 వేల నుంచి 71 వేలు 
  • వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 నుంచి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 27.  
  • లాస్ట్ డేట్: నవంబర్ 15. 
  • పూర్తి వివరాలకు nml.co.in 
  • వెబ్​సైట్​లో సంప్రదించగలరు.