వాహనదారులకు బిగ్ అలర్ట్: హైదరాబాద్‎లో రేపు (అక్టోబర్ 22) ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

వాహనదారులకు బిగ్ అలర్ట్: హైదరాబాద్‎లో రేపు (అక్టోబర్ 22) ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. సదర్ ఉత్సవ మేళా సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. నారాయణగూడలోని YMCA దగ్గర 2025, అక్టోబర్ 22 రాత్రి 7 గంటల నుంచి అక్టోబర్ 23 తెల్లవారుజామున 4 గంటల వరకు సదర్ ఉత్సవ మేళా జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ అమల్లో ఉంటాయని వెల్లడించారు.

రామ్‌కోటి, లింగంపల్లి, నారాయణగూడ, బర్కత్‌పురా, విజయనగరం, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తాత్కాలికంగా మళ్లింపులు చేపట్టనున్నట్లు తెలిపారు. సదర్ మేళాకు వచ్చే వారు తమ వాహనాలను కేశవ మెమోరియల్ కళాశాల మైదానంలో పార్క్ చేయాలని పోలీసులు సూచించారు. వాహనదారులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలి- ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.