నిర్మల్ టౌన్లో సైకో వీరంగం.. బ్లేడుతో తనను తానే కోసుకున్నాడు

నిర్మల్ టౌన్లో సైకో వీరంగం.. బ్లేడుతో తనను తానే కోసుకున్నాడు

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒక యువకుడు చేసిన హల్ చల్.. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మతిస్థిమితం పోయిన వ్యక్తిలా.. తనపై తాను దాడి చేసుకుంటూ కానిస్టేబుల్ పై కూడా దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. మంగళవారం (అక్టోబర్ 21) రాత్రి టౌన్ లోని నగరేశ్వరవాడలో ఒక సైకో చేసిన అల్లరి హాట్ టాపిగ్ గా మారింది. 

మంగళవారం రాత్రి ఒక కానిస్టేబుల్ పై గుర్తుతెలియని యువకుడు దాడికి ప్రయత్నించాడు. యువకుడు అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో వివరాలు ఆరా తీసేందుకు ప్రయత్నించాడు కానిస్టేబుల్. దీంతో సమాధానం చెప్పకపోగా పిచ్చివాడిలా ప్రవర్తించినట్లు కానిస్టేబుల్ తెలిపాడు.

యువకుడు బ్లేడుతో తనను తాను గాయపర్చుకుని.. ఆపై కానిస్టేబుల్ పైన దాడికి విఫల యత్నం చేశాడు. యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు.