హైదరాబాద్ సిటీ, వెలుగు: కూకట్‌పల్లి నల్ల చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 9న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. సభా ప్రాంగణం ఎక్కడ ఏర్పాటు చేయాలని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్టాళ్లను ఎక్కడ పెట్టాలనే వాటి గురించి స్థలాలను పరిశీలించారు. ఈ ప్రొగ్రామ్‌కు ఎంతమంది వస్తారని, వారికి సీటింగ్ ఏర్పాట్లు ఎలా ఉండాలి అనే అంశాలపై సమీక్షించారు.
అవసరమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నల్లచెరువుని అభివృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహిరించిన హైడ్రా కమిషనర్ ని స్థానికులు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్ ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి, హైడ్రా డీసీపీ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
