- సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతరు
- ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్వర్సిటీ లో ఈ నెల 8, 9 తేదీల్లో మెగా మహిళా రైతు మేళా నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ అల్దాస్జానయ్య తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌కు చీఫ్‌గెస్ట్‌గా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో బ్రోచర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నో రైతు మేళాలు నిర్వహించామన్నారు. కానీ, వ్యవసాయ రంగంలో మహిళల పాత్రను గుర్తిస్తూ తొలిసారి మహిళా రైతు మేళా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమానికి 8 వేల నుంచి 10 వేల మంది మహిళా రైతులు హాజరవుతారన్నారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కారాలపై శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులతో చర్చించనున్నట్లు తెలిపారు. వివిధ ఆధునిక సాంకేతిక అంశాలపై 70 నుంచి -80 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
