
వన్డే క్రికెట్ లో వెస్టిండీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఫామ్ లో లేని వెస్టిండీస్ జట్టు వరల్డ్ రికార్డ్ అంటే ఆశ్చర్యపోవడం గ్యారంటీ. వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మంగళవారం (అక్టోబర్ 21) రెండో వన్డే ప్రారంభమైంది. ఢాకా వేదికగా షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో ఆశ్చర్యకరంగా వెస్టిండీస్ స్పిన్నర్ తో వేయించింది. అయితే విశేషం ఏమిటంటే 50 ఓవర్లు వెస్టిండీస్ స్పిన్నర్ల చేత బౌలింగ్ వేయించడం షాకింగ్ గా మారింది. పిచ్ స్పిన్ కు అనుకూలించడంతో విండీస్ జట్టు ఏకంగా 50 ఓవర్లు స్పిన్ కే ఇవ్వడం విశేషం.
వెస్టిండీస్ ప్లేయింగ్ 11లో ఒక్క స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ కూడా లేకపోవకడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆల్ రౌండర్లు రూథర్ ఫోర్డ్, గ్రేవీస్ మీడియం పేస్ వేయగలిగిన వీరికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. పిచ్ మీద చాలా పగుళ్లు ఉండడంతో కెప్టెన్ షాయ్ హోప్ ఐదుగురు స్పిన్నర్లను ఉపయోగించాడు. అకేల్ హోసిన్, రోస్టన్ చేజ్, అలిక్ అథనాజ్, గుడాకేష్ మోతీ, ఖారీ పియరీ తలో 10 ఓవర్లు వేసి తమ స్పెల్ పూర్తి చేశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో విండీస్ మొత్తం 50 ఓవర్లను స్పిన్నర్లకే అప్పగించింది. పార్ట్ టైం స్పిన్నర్ అలిక్ అథనాజ్ కూడా 10 ఓవర్ల స్పెల్ వేశాడు.
►ALSO READ | BAN vs WI: వామ్మో పిచ్‌పై ఈ పగుళ్లేంటి: బంగ్లాదేశ్, వెస్టిండీస్ రెండో వన్డే.. 50 ఓవర్లు స్పిన్నర్లు వేశారుగా
వన్డే క్రికెట్ చరిత్రలో అసోసియేట్ జట్టు కాకుండా పూర్తి సభ్యత్వ జట్టుగా 50 ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేసిన తొలి జట్టుగా విండీస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. అంతకముందు ఈ రికార్డ్ శ్రీలంక పేరిట ఉంది. వన్డేల్లో శ్రీలంక మూడు వేరు వేరు మ్యాచ్ ల్లో 44 ఓవర్ల పాటు బౌలింగ్ చేయడం ఇప్పటివరకు అత్యధికం. 1996లో వెస్టిండీస్ పై.. 1998లో న్యూజిలాండ్ పై.. 2004 లో ఆస్ట్రేలియాపై జరిగిన వన్డే మ్యాచ్ లో శ్రీలంక 44 ఓవర్ల పాటు స్పిన్ బౌలింగ్ వేసింది. తాజాగా బంగ్లాదేశ్ పై వెస్టిండీస్ ఈ రికార్డ్ బ్రేక్ చేసింది.ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కూడా తమ తొలి 7 ఓవర్లు స్పిన్నర్లు వేయడం గమనార్హం.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. పిచ్ స్పిన్ కు అనుకూలించడంతో విండీస్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆతిధ్య బంగ్లా జట్టును కట్టడి చేశారు. 45 పరుగులు చేసిన సౌమ్య సర్కార్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ 32 పరుగులు చేసి రాణించగా.. చివర్లో రిషద్ హుస్సేన్ 14 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసి చివర్లో జట్టును 200 స్కోర్ దాటించాడు. వెస్టిండీస్ బౌలర్లలో గుడాకేష్ మోతీ మూడు వికెట్లు పడగొట్టాడు. అకేల్ హోసిన్, అలిక్ అథనాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి వన్డేలో బంగ్లాదేశ్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది.