సోమాజిగూడ యశోద హస్పత్రిలో BRS నాయకులు హంగామా చేశారు. హాస్పిటల్ లో వీడియోలు తీయోద్దని చెప్పిన సిబ్బంది మీదకు దాడికి దిగారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు సెక్యూరిటీ సిబ్బంది, స్టాఫ్ పై దాడి చేసి హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేశారు. యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఓ యూ ట్యూబర్ ను పరామర్శించడానికి కొందరు BRS నాయకులు వెళ్ళారు. వారు హాస్పత్రిలో సెల్ ఫోన్ తో వీడియోస్ తీస్తుండగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
దీంతో రెచ్చిపోయిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వీడియోస్ తీయ్యోదు అంటావా అని సెక్యూరిటీ సిబ్బంది, డాక్టర్స్, స్టాఫ్ పై దాడికి దిగారు. విచక్షణారహితంగా హాస్పిటల్ సిబ్బందిపై దాడికి చేసిన దృష్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ గా మారాయి.