బీఆర్‌‌‌‌ఎస్ అంటేనే ‘బహిష్కరణ రాష్ట్ర సమితి’ : రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి

బీఆర్‌‌‌‌ఎస్ అంటేనే ‘బహిష్కరణ రాష్ట్ర సమితి’ : రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి
  •     రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కామెంట్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అంటేనే ‘బహిష్కరణ రాష్ట్ర సమితి’ అని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి అన్నారు. మంగళవారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను బహిష్కరించినందునే రాష్ట్రంలో ఇప్పుడు ఆ పార్టీ ‘బహిష్కరణ రాష్ట్ర సమితి’ గా మారిందని ఆరోపించారు. 

రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ అనే పార్టీని తెలంగాణ ప్రజలు మరిచిపోయారని విమర్శించారు. తెలంగాణ భవన్ లో సీఎం రేవంత్​కు వ్యతిరేకంగా నాటకాన్ని ప్రదర్శించి.. కేటీఆర్, హరీశ్ రావులు ఆయన పేరును స్మరించుకుంటూ పునీతులయ్యారన్నారు.