బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యకు నిరసన సెగ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యకు నిరసన సెగ

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గ్రామాల్లో నిరససెగ కంటిన్యూ అవుతోంది. ఎక్కడిక్కడ రోజుకోచోట ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు గ్రామస్తులు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ప్రశ్నిస్తున్నారు. నీళ్లు రావడం లేదని, రోడ్లు వేయడం లేదని.. పించన్లు రావడం లేదని ఇలా ఎమ్మెల్యేలను అడ్డుకుని నిరసన తెలుపుతున్నారు. కొన్ని చోట్ల ఫ్లెక్సీలు వేసి మరి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు స్థానికులు. మరికొన్ని చోట్ల తమ గ్రామాల్లోకి ఎమ్మెల్యే రావొద్దంటూ బహిరంగంగానే పోస్టర్లు వేస్తున్నారు.  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జీవన్ రెడ్డి, రెడ్యానాయక్ ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజాగ్రహానికి గురైన వాళ్లే. లేటెస్ట్ గా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు మరోసారి నిరసన సెగ తగిలింది. 

వేలేర్ మండలం పీచరలో రచ్చబండలో పాల్గొన్న రాజయ్య ను గ్రామాభివృద్ధి, తమ సమస్యకు పట్టించుకోవడం లేదని  నిలదీశారు గ్రామస్థులు. ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే అభ్యంతరం తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు MLA రాజయ్య.