
బీఆర్ఎస్ ఎమ్మెల్య రాములు నాయక్ కు నిరసన సెగ తగిలింది. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని గొల్లపూడి గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రైతు వేదిక భవనం ప్రారంభించారు ఎమ్మెల్యే రాములు నాయక్. అనంతరం రైతు వేదిక భవనం నందు రైతులతో మహిళలతో సమావేశం నిర్వహించారు.
అయితే ఎమ్మెల్యే మాట్లాడుతుండగా రైతు రుణమాఫీ గురించి ప్రస్తావించారు రైతులు. దీంతో రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాములు నాయక్. వాళ్లను సభ నుండి గెంటేయండంటూ ఆదేశాలిచ్చారు. దీంతో అక్కడున్న వారు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల గురించి ప్రశ్నిస్తే ఎమ్మెల్యే బయటకు వెళ్లాలంటారా అంటూ మండిపడ్డారు.