
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పని చేసి 20 ఏండ్ల కాంగ్రెస్ పార్టీకి నాంది పలుకాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జనవరి 18వ తేదీ గురువారం తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఐఎన్ టియుసి 2024 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేండ్లలో రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు తీరుస్తామన్నారు. గత పదేండ్లలో ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు నిర్భందాలకు గురయ్యారన్నారు. పనికిరాని పవర్ ప్లాంట్ కు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. విద్యుత్ డిస్కంలను నష్టాల్లోకి నెట్టేశారని అన్నారు.
కేసీఆర్ కాదు.. బావ బావమరదులు కేటీఆర్, హరీష్ రావులకు మతి బ్రమించిందని మంత్రి వెంకట్ రెడ్డి అన్నారు. మేం తలుచుకుంటే బీఅర్ఎస్ ను ఆరు ముక్కలు చేస్తామని ఆయన హెచ్చరించారు. బీఅర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తామంటున్నారని..కానీ, మేము తీసుకుంటలేమన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే 20 ఏండ్లు పరిపాలిస్తామని అన్నారు. రానున్న రోజుల్లో బీఅర్ఎస్ పార్టీకి గట్టి బుద్ది చెబుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.