అసెంబ్లీ ఆవరణలో బైఠాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

అసెంబ్లీ ఆవరణలో బైఠాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్‌ సభ్యుల వాకౌట్‌ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్‌ చేశారు బీఆర్ఎస్‌. అనంతరరం అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దనే నిబంధన ఉందన్న పోలీసులు చెప్పడంతో.. కొత్త నిబంధనలు ఏంటని పోలీసులతో కేటీఆర్‌, హరీష్‌రావు వాగ్వాదానికి దిగారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించి నిరసన చేపట్టారు.ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు.. అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి కూడా ఇవ్వరా.. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం ..కంచెల రాజ్యం..  పోలీస్ రాజ్యం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుల నినాదాలు చేశారు.

రెండు నెలల కాంగ్రెస్ పాలనలో కంచెల పాలన తెచ్చి మా గొంతు నొక్కుతున్నారని  జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీనియర్ ఎమ్మెల్యే దళిత నాయకుడు కడియం శ్రీహరిపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన అనుచిత భాషను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కడియం సీనియర్ ఎమ్మెల్యే.. ఆయన ఎక్కడా బడ్జెట్ కు సంబంధం లేని విషయాలు మాట్లాడలేదని చెప్పారు. 

సీఎం రేవంత్ ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ.. దాన్ని తెలంగాణ భాషగా చెప్పుకుంటున్నాడని విమర్శించారు. తెలంగాణ భాషను సీఎం అవమానపరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని... ఆయనకు తెలంగాణకు ఏం సంబంధమని ప్రశ్నించారు. అక్కడ కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.