
హైదరాబాద్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం సిటీలో బస్ చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపిందని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. పెంచిన చార్జీలపై నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు డి.సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ బస్సులో ప్రయాణించారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అసెంబ్లీ దగ్గర బస్సు దిగాక మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే వాహనాల పన్ను, మద్యం ధరలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సిటీ బస్సు చార్జీలను పెంచి పేదల వ్యతిరేకిగా రుజువు చేసుకుందన్నారు. చార్జీలు తగ్గించే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాడుతామని చెప్పారు.