
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గచ్చిబౌలి AIG ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సుదీర్ఘకాలం పాటు తీహార్ జైలులో ఉన్న సమయంలో ఆమె అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. గైనిక్ సమస్యలు.. తీవ్రమైన జ్వరంతో అనేకసార్లు ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరిక్షలు నిర్వహించారు. ప్రస్తుతం బెయిల్ పై విడుదల కవిత.. ఆరోగ్య పరిక్షల నిమిత్తం గచ్చిబౌలి AIG ఆస్పత్రికి మంగళవారం ( అక్టోబర్ 1)న వెళ్లారు. ఈ రోజు సాయంత్రానికి కవితకు వైద్య పరిక్షలు పూర్తి అయిన వెంటనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.