ఆర్.కృష్ణయ్యతో ఎమ్మెల్సీ కవిత భేటీ

ఆర్.కృష్ణయ్యతో ఎమ్మెల్సీ కవిత భేటీ

ముషీరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపామని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్యతో విద్యానగర్​లోని ఆయన నివాసంలో కవిత  భేటీ అయ్యారు. 

అనంతరం ఏర్పాటు చేసిన ఉమ్మడి సమావేశంలో కవిత మాట్లాడుతూ..  బీసీ రిజర్వేషన్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా ఉద్యమాలే శరణ్యమన్నారు. అందుకోసమే ఆర్. కృష్ణయ్య మద్దతు కోరినట్లు చెప్పారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ ఉద్యమానికి ఎవరు ముందుకొచ్చినా పూర్తి మద్దతు ఇస్తామన్నారు. 

బీసీల రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. కవిత బీసీ కాకపోయినా బీసీల కోసం పోరాటం చేస్తున్నారని, బీసీలు ఇప్పుడు మౌనం వహిస్తే ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు కూడా కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గుజ్జ సత్యం మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల మీద రాష్ట్ర ప్రభుత్వం పులి మీద స్వారీ చేస్తుందని వ్యాఖ్యానించారు. అనంతయ్య, వేముల రామకృష్ణ, మణికంఠ ఉన్నారు.