ఢిల్లీ లిక్కర్ కేస్ అప్ డేట్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ 28కి వాయిదా

ఢిల్లీ లిక్కర్ కేస్ అప్ డేట్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ 28కి వాయిదా


ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  పిటిషన్ ను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది.  జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ బెంచ్ విచారణ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు జారీ చేసిన నోటీసులపై అభ్యంతరం తెలుపుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. . నళినిచిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులను కూడా విచారించింది.  కవిత దాఖలు చేసిన పిటిషన్ ను ప్రత్యేకంగా విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. 

also read : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

మహిళలను ఈడీ కార్యాలయానికి పిలవకుండా వారి ఇళ్లలోనే విచారణ చేయాలని పిటీషనర్లు కోరుతున్నారు. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వరసగా ఈడీ అధికారులు నోటీసులు ఇస్తున్నా కవిత హాజరు కావడం లేదు. లిక్కర్ కేసులో ఈడి నోటీసులను సవాల్ చేస్తూ  గతేడాది సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేశారు.