- ఒరిజినల్, డూప్లికేట్ అంటూ కోల్గేట్, బిస్లరీ బ్రాండ్స్ పోస్ట్
హైదరాబాద్, వెలుగు: కవిత పార్టీపై బీఆర్ఎస్ సెటైర్లు వేసింది. ఒరిజినల్, డూప్లికేట్అంటూ పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. శనివారం కవిత తన పార్టీ పేరు టీఆర్ఎస్ అని ప్రకటించగానే.. బీఆర్ఎస్ లీడర్లు కోల్గేట్ పేస్ట్, బిస్లరీ వాటర్ ఒరిజినల్, డూప్లికేట్ బ్రాండ్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘ఒరిజినల్ బ్రాండ్స్‌కు ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని, తొందర గా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇలా ఫేక్ బ్రాండ్స్ తయారు చేసి, అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు. ఏది ఒరిజినలో.. ఏది డూప్లికేటో తెలుసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు’ అని కామెంట్ పెట్టారు. ఇక, కవిత పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన కాదని, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్(టీఆఆర్ఎస్ఏ) అని ప్రచారం చేస్తున్నారు. అందుకు కవిత పార్టీ జెండాలో అడుగున ఉన్న అసోసి యేషన్ అనే పదాన్ని చూపిస్తూ పోస్టులు పెడుతున్నారు.
కవితక్క కాదు.. కవితమ్మ
మరోవైపు తెలంగాణ రాష్ట్ర సేన కార్యకర్తలు కూడా కవితను హైలైట్ చేసేలా పోస్టులు పెడుతున్నారు. ఇన్నాళ్లూ ఆమెను కవితక్క అని, ఇప్పుడు కవితమ్మ అంటూ పిలుస్తున్నారు. కవితమ్మ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌చేస్తున్నారు. తెలంగాణ జాగృతి ఎక్స్అకౌంట్లోనూ పోస్టులు పెట్టారు. పార్టీ ప్రకటన సంద ర్భంగా కవిత.. 3.5 కోట్ల మందికి అమ్మగా మారుతానంటూ కామెంట్ చేయగా.. ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

