బడ్జెట్ లో రైతు రుణమాఫీ ముచ్చటే లేదు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

బడ్జెట్ లో రైతు రుణమాఫీ ముచ్చటే  లేదు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల బడ్జెట్‍ తీసుకొచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ భ్రమలో ఉండి సీఎం కేసీఆర్ తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు నిధులు కేటాయించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. బడ్జెట్ లో రైతు రుణమాఫీ ప్రస్తావన లేకపోవడం దారుణమన్న జీవన్ రెడ్డి... అన్నదాతలను ఓటు అడిగే హక్కు కేసీఆర్ కోల్పోయాడని అన్నారు.

గిరిజన బంధును కనుమరుగు చేశారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో పోడు భూముల ప్రస్తావన లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి హామీ ఇచ్చి కేసీఆర్ మాట తప్పాడని ఆరోపించారు. మహిళా సంక్షేమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గాలి కొదిలేసిందని జీవన్ రెడ్డి మండిపడ్డారు.