కోహెడ అంతర్జాతీయ పండ్ల మార్కెట్, ఫ్యూచర్ సిటీ, పాలమూరు ప్రాజెక్టుల అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అడ్డుపడిన అభివృద్ధి చేసుకుంటూ పోవాల్సిందేనని అన్నారు. 2026 జూన్ 06న రంగారెడ్డి జిల్లా కోహెడ లో కోహెడ అంతర్జాతీయ పండ్ల మార్కెట్ కు శంకుస్థాపన చేసిన సీఎం.. పండ్ల మార్కెట్ వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఏటా 8 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందన్నారు.
ఒకప్పుడు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ వాసులకు కూరగాయలు, పండ్లు అందించేదని.. కానీ రియల్ ఎస్టేట్ వల్ల వ్యవసాయం కుంటుపడిందన్నారు. మళ్లీ రైతులు కూరగాయలు, పండ్లు పండించాలని.. అందుకోసమే 239 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి మార్కెట్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ ర్యక్రమంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేటి, ఎమ్మెల్యే మల్ రెడ్డి పాల్గొన్నారు.
సీఎం రేవంత్ కామెంట్స్:
- రైతుల కోసం అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడుతున్నాం
- ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తో ఏటా 8 కోట్ల ఆదాయం
- అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది
- ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కూరగాయలు, ఆకుకూరలు పండేవి
- మోదీ ప్రభుత్వం లో ధరలు పెరిగాయి
- రియల్ ఎస్టేట్ రంగం పెరగటం వల్ల వ్యవసాయం కుంటుపడింది.
- కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి..
- కొత్తిమీర కొనాలన్నా ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతున్నాం
- మన ప్రాంతంలో అన్ని రకాల పండ్లు పండించాలి
- ప్రభుత్వం చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారు
- కాలుష్యం లేని గొప్ప నగరాన్ని నిర్మించాలనుకున్నాం
- కోహెడ్ పండ్ల మార్కెట్ కట్టేందుకు వీలులేదని బీఆర్ఎస్ అంటోంది
- అభివృద్ధి చేద్దామంటే అడ్డుపడుతున్నారు.. రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు
- అభివృద్ధి ని ఇలానే అడ్డుకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాదు
- సహకరించకపోతే శాశ్వతంగా ఫమ్ హౌజ్ లోనే కారు
- ట్రిపుల్ ఆర్ ను బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటోంది
- ఫ్యూచర్ సిటీ, కోహెడ మార్కెట్, పాలమూరు ప్రాజెక్టుకు బీఆర్ఎస్ అడ్డంకి
- కుర్చీవేసుకుని పాలమూరు కడ్తా అన్న కేసీఆర్ తర్వాత పట్టించుకోలేదు
- ట్రిపుల్ ఆర్, కోహెడ మార్కెట్, పాలమూరు ఎట్టి పరిస్థితిలో ఆపేది లేదు.
- అంతర్జాతీయ నగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు.. అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి
- అందుకే అభివృద్ధి చేసుకుంటూ పోవాల్సిందే
- తాటి చెట్టంత పెరిగితే తెలివి ఎక్కువ అనుకుంటున్నరు
- హరీష్ రావు తెలివితో కట్టిన కాళేశ్వరం కూలిపోయింది
- హరీష్ రావు దిక్కుమాలిన సలహాలు అవసరం లేదు
- కిషర్ రెడ్డి, బండి సంజయ్ తమాషా చేస్తున్నారు..దిగిపో అంటున్నారు.
- దిగిపో అంటున్నారు.. అల్లాటప్పగా రాలేదు.. తొక్కుకుంటూ వచ్చా
- మేం గద్దె దిగటం కాదు.. మోదీని దిగమని చెప్పండి
- జూన్ 15 వ రకు చూస్తాం. ఆ తర్వాత ధాన్యం ఎలా కొనరో చూస్తాం
- ఫాం హౌజ్ లో ఉన్న కేడీతో అయినా.. ఢిల్లీలో ఉన్న మోదీతో అయినా కొట్లాడుతాం
- రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తాం.. ధాన్యం కొనేలా చేస్తాం
