- పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
పాపన్నపేట, వెలుగు: కాంగ్రెస్ మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పాపన్నపేట, కొడపాక, శేరిపల్లి, బాచారంలో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పల్లెల ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి ప్రజలు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికలున్నాయనే గ్రామాల్లో మహిళలకు చీరలను పంపిణీ చేశారన్నారు. ఈ ప్రభుత్వం రెండేళ్లలో గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి మంజూరు చేయలేదన్నారు. ఆమె వెంట పార్టీ నాయకులు ఉన్నారు.

