
న్యూఢిల్లీ: లిస్టింగ్ రూల్స్ ప్రకారం కంపెనీ బోర్డుల్లో డైరెక్టర్లను నియమించుకోవడంలో వరుసగా నాల్గో క్వార్టర్‌లోనూ ఫెయిలైన ఐఓసీ, ఓఎన్‌జీసీ, గెయిల్ (ఇండియా) తో పాటు మరికొన్ని కంపెనీలపై స్టాక్ ఎక్స్చేంజ్‌లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ఫైన్ వేశాయి. ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ (ఎంఆర్‌పీఎల్) లిస్టింగ్ రూల్స్‌ను మార్చి క్వార్టర్ చేరుకోకపోవడంతో వీటిపై
మొత్తంగా రూ.34 లక్షల ఫైన్ విధించాయి. ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, గెయిల్, ఆయిల్, ఎంఆర్‌పీఎల్‌పై రూ.5,36,900 చొప్పున ఫైన్ పడింది. ఓఎన్‌జీసీపై రూ.1,82,900 ఫైన్ పడింది. కాగా, లిస్టింగ్ రూల్స్ ప్రకారం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉన్నట్టుగానే ఇండిపెండెంట్ డైరెక్టర్లను కంపెనీలు నియమించుకోవాలి. బోర్డులో కనీసం ఒక మహిళా డైరెక్టర్ అయినా ఉండాలి.