ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్ ఎల్ మొత్తం నష్టాలు 2018 డిసెంబర్ చివరి నాటికి రూ.90వేల కోట్లను అధిగమించి ఉంటా యని కొటక్ ఇన్ స్టిట్యూషనల్ ఈక్వి టీస్(కేఐఈ) అంచనా వేసింది. ఈ టెలికాం సంస్థ నడిచేందుకు అవసరమైన ఈక్వి టీని ఎప్పడికప్పుడు ప్రభుత్వం అందిం చడమో లేదా మూసివేసి, ఖర్చులను పొదుపు చేసేందుకు ఒకేసారి నష్టాలు భరించడమో చేయాలని కేఐఈ సూచించింది. టారిఫ్‌లు బాగా పడిపోవడంతో మొత్తం టెలికాం పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను ఈ బ్రోకింగ్ సంస్థ రిపోర్టు హైలెట్ చేసింది. ఒకవేళ ఇది ఇలానే కొనసాగితే వచ్చే స్పెక్ట్రమ్ ఆక్షన్ కు అంత మంచిది కాదని హెచ్చరించింది. ఒకవేళ టారిఫ్‌లు పెరగకపోయినా కూడా.. ఈ రంగం మరింత కుదేలు కానుందని చెప్పింది. వచ్చే కొన్నే ళ్లలో బ్లాక్ బస్టర్ స్పెక్ట్రమ్ వేలాలుకనపడటం చాలా తక్కు వేనని కేఐఈ చెప్పింది. బీఎస్‌ఎన్ ఎల్‌లో ఆందోళనకర పరిస్థితులు పెరుగుతున్నాయని, బీఎస్‌ఎన్ ఎల్ మొట్టమొదటిసా రి 2019 ఫిబ్రవరి వేతనాలు ఇవ్వలేకపోయిందని వివరించింది. ఒకవేళ టారిఫ్‌లు పెరగకపోతే, ఈ రంగం ఎదుర్కొనే ఒత్తిడి లో అత్యధిక మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది.
