
ప్రభుత్వరంగం టెలికం ఆపరేటర్ BSNL తమ కస్టమర్లకోసం కొత్త రీచార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో తమ కస్టమర్లు ఎయిర్ టెల్, జియో, ఐడియా వంటి ప్రైవేట్ టెలికం కంపెనీల వైపు మొగ్గు చూపుతుండటంతో తిరిగి వారిని వెనక్కి రప్పించేందుకు BSNL ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త కొత్త రీచార్జ్ ప్లాన్లను పరిచయం చేస్తోంది. ఇప్పటికే అనేక ఆకట్టుకునే ప్లాన్లను ప్రవేశపెట్టిన బీఎస్ ఎన్ ఎల్ తాజాగా గేమ్ ఛేంజింగ్ ఆఫర్ ను సబ్ స్క్రైబర్లకోసం అందిస్తోంది.
ఎక్కువగా డేటా ఉపయోగించే వారికి ఈ ఆఫర్ సరియైనది. BSNL సబ్ స్క్రైబర్లు 300రూపాయలకంటే తక్కువ ధరకే ప్రతి రోజూ 3GB డేటాను పొందవచ్చు. ఇంటర్నెట్ బ్రౌజింగ్, OTT స్ట్రీమింగ్, ఆన్ లైన్ షాపింగ్ వంటివి నేటి ప్రపంచంలో అందరూ చేస్తున్నారు. కాబట్టి డేటా త్వరగా అయిపోతుంది. రీచార్జ్ ప్లాన్ల ధరలు పెరిగినందున ప్రతి నెలా తగినంత డేటాతో కూడిన ప్లాన్లను కొనుగొనడం ఓ సవాల్ గా మారింది. BSNLఇటువంటి సమస్యను తీర్చేందుకు గేమ్ ఛేంజింగ్ ప్లాన్ ను వినియోగదారులకు అందిస్తోంది.
BSNL రూ. 299 రీఛార్జ్ ప్లాన్
మీరు BSNL నెట్ వర్క్ వాడుతున్నట్లయితే నెలంతా కాలింగ్, డేటా ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్నీ తక్కువ ధరకే బీఎస్ ఎన్ ఎల్ అందిస్తోంది. కేవలం రూ. 299 ధరతో ఆకట్టుకునే రీచార్జ్ ఎంపికను ప్రకటించింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. నెలంతా అన్ని నెట్ వర్క్ లకు అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత SMS లు అందిస్తోంది.
BSNL కస్టమర్లు ముఖ్యంగా ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగించేవారికి అద్భుతమైన గిఫ్టి ఈ ప్లాన్. 30రోజుల వ్యవధిలో 90GB డేటా అంటే రోజుకు 3GB హైస్పీడ్ డేటాను అందిస్తుంది.ఒకవేళ డేటా అయిపోయినా తక్కువ స్పీడ్ తో ఇంటర్నెట్ యాక్సెస్ చేయొచ్చు. అదే 3GB డేటాను జియో అయితే 449 ప్లాన్ ద్వారా అందిస్తుంది. కేవలం 28 రోజులు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది.
తాజాగా BSNL తీసుకొచ్చిన కొత్త ప్లాన్ డేటా అధికంగా వినియోగించే వారికి మంచి ఎంపిక.