దేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

దేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ లాంటి మూర్ఖపు నాయకుల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆరే రాజ్యంగంపై చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయన్నారు. ఎంతో మంది మహనీయుల త్యాగాలతో రాజ్యాంగ రూపొందించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తులు , కమిషన్లు పెంచుకునేందుకే రాజ్యాంగాన్ని మార్చలనుకుంటున్నారా? అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పడి , ఆయన ముఖ్యమంత్రి అయిన విషయాన్ని మరిచిపోయారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉదృతం చేస్తామన్నారు ప్రవీణ్ కుమార్.

భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ ఏర్పడిందన్నారు. ఎందుకు భారత రాజ్యాంగాన్ని మార్చాలో దేశ ప్రజలకు కేసీఆర్ చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ అనర్హుడు అంటూ ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం లో లక్ష 15 వేల కోట్ల రూపాయలు ఒకటే కంపెనీకి ఇచ్చి తిరిగి దొడ్డిదారిన కేసీఆర్ సంపాదిస్తున్నాడని విమర్శించారు. ఒక IAS ఇంట్లో ఒక కార్యక్రమానికి మెగా సంస్థ 50 లక్షల రూపాయలు ఇచ్చారని ఆరోపణలు చేశారు ప్రవీణ్ కుమార్. కొన్ని జీవోలు రహస్యంగా తీసుకొస్తున్నారన్నారు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతిభావన్ కి ఎవరినీ రానివ్వడం లేదని విమర్శించారు. లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములను లాక్కొని మీకు సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టడానికా రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు? అంటూ నిలదీశారు. బీజేపీ బాహాటంగా ముస్లింలను ఏరివేయలని ప్రకటించిందన్నారు. నిరంకుశ పాలన కొనసాగించడానికే రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారా? అంటూ కేసీఆర్ వైఖరిపై మండిపడ్డారు. రాజ్యాంగం పవిత్రమైనది... రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చినపుడు చట్టసభల ద్వారా మారుస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఏకమై రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. 

కేసీఆర్ బాధ్యతరహితమైన ప్రకటనలు మానుకొని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ క్షమాపణ చెప్పేవరకు రాష్ట్రవ్యాప్తంగా బీఎస్పీ తరపున ఆందోళనలు నిర్వహిస్తున్నామన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ లతో కేసీఆర్ మీటింగ్ పెడతా అంటున్నారు... దానికి తనను ఆహ్వానిస్తే అస్సలు వెళ్ళనన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.