
సీఎం కేసిఆర్ కాసుల కక్కుర్తి కోసం కొమురం భీం జిల్లా ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని బీఎస్పీ చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రాణహిత -చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రాజెక్టుకి అంబేద్కర్ పేరును సహించలేక... ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్ చేశారని ఆరోపించారు. బీఎస్పీ అధికారంలోకి రాగానే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. పాత ప్రాజెక్టులు కడితే కమీషన్లు రావని.. కేసిఆర్ కు పేరు దక్కదని... కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని తెలిపారు. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ నేతలకు తరగని ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు మాత్రం తరగని అప్పులే మిగిల్చారని చెప్పారు.
బి.ఆర్.ఎస్ ది కుంభకోణాల ప్రభుత్వమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మన రైతులను ముంచి మహారాష్ట్ర రైతులకు పరిహారం ఇవ్వడం విచిత్రంగా ఉందన్నారు. తుమ్ముడిహెట్టి వద్ద ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని రైతులకు తిరిగి ఇచ్చేయాలని సూచించారు. కొమురంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ బహుజన రాజ్యాధికార యాత్రలో పాల్గొన్న ప్రవీణ్ కుమార్..కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కేసీఆర్ కు లాభం.. రైతులు నష్టం జరిగిందన్నారు.
బీఆర్ఎస్ నేతలు తరగని ఆస్తులు సంపాదించుకున్నరు