13 మందితో బీఎస్పీ నాలుగో లిస్ట్ ​రిలీజ్​

13 మందితో బీఎస్పీ నాలుగో లిస్ట్ ​రిలీజ్​

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బహుజన సమాజ్ పార్టీ నాలుగో లిస్ట్​ను రిలీజ్​ చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం రాత్రి మరో 13 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 87 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంతో బీఎస్పీ పోటీ చేసే మొత్తం స్థానాలు 100 చేరాయి. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.