
హైదరాబాద్: ప్రగతి భవన్ లో నిత్యం విందులిచ్చే కేసీఆర్ కు మధ్యాహ్న భోజనానికి ఇవ్వడానికి డబ్బులు లేవా అని మాజీ ఐపీఎస్, బీఎస్పీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కోట్ల రూపాయలతో విందులు ఇస్తారని.. మెస్ ఛార్జీలు చెల్లించలేరా అని క్వశ్చన్ చేశారు. వాసాలమర్రిలో రూ.3 కోట్లతో విందు ఇచ్చారని, ప్రగతి భవన్ లోనూ ఎప్పుడూ విందులు ఇస్తుంటారని.. మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీలకు మాత్రం మెస్ ఛార్జీలు చెల్లించడం లేదని దుయ్యబట్టారు.
వాసాలమర్రిలో ₹3 కోట్లతో విందు, ప్రగతి భవన్ లో నిత్యం విందులిచ్చే KCR మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీలకు మెస్ చార్జీలు చెల్లించలేడా? 1.7 కోట్ల టన్నుల ధాన్యం పండిన ధనిక రాష్ట్రంలో సర్కార్ బడుల్లో విద్యార్థులు అన్నం లేక అల్లాడుతున్నారు.మీ పొట్టలు నిండాలి,మా పొట్టలు ఎండాలి. నహీచలేగా✊ pic.twitter.com/xItBBhZG7Q
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) December 20, 2021
రూ.1.7 కోట్ల టన్నుల ధాన్యం పండిన ధనిక రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులు అన్నం లేక అల్లాడుతున్నారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మీ పొట్టలు నిండాలి, మా పొట్టలు ఎండాలా.. నహీచలేగా అని ట్వీట్ చేశారు.
మరిన్ని వార్తల కోసం: