
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులను ప్రత్యేకించి ఉపాధ్యాయులను ఉగ్రవాదులుగా చూస్తోందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జీవో 317కు సవరణలు చేయాలని.. ఇందిరాపార్కులో శాంతియుతంగా నిరసన చేయాలనుకున్న ఉద్యోగులను రాత్రికి రాత్రే ప్రభుత్వం అదుపులోకి తీసుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులను ప్రత్యేకించి ఉపాధ్యాయులను ఉగ్రవాదులుగా చూస్తున్నది. లేకపోతే, GO 317 కు సవరణలు కావాలని ఇందిరపార్క్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తామంటే, రాత్రికి రాత్రే అన్ని జిల్లాల్లో ఉద్యోగులను #KCR ప్రభుత్వం అదుపులోకి తీసుకోవడం దేనికి సంకేతం?
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) February 9, 2022
మరో ట్వీట్ లో మోడీ వ్యాఖ్యలకు నిరసనగా ప్రజలు రోడ్లెక్కాలని మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని ప్రవీణ్ కుమార్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన రాజ్యాంగాన్నే మార్చాలని కేసీఆర్ పిలుపునిచ్చినపుడు ఎక్కడ దాక్కున్నారని క్వశ్చన్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూటమి దేశంలో మత విద్వేషాలు రగిలిస్తుంటే.. బీసీల జనాభా గణనకు నిరాకరించినపుడు ఎందుకు రోడ్డెక్కలేదని దుయ్యబట్టారు.
మోడి వ్యాఖ్యలకు నిరసనగా ప్రజలు రోడ్లెక్కాలని @KTRTRS పిలుపునివ్వడం నిజంగా హాస్యాస్పదం.తెలంగాణ ఏర్పాటుకు కారణమైన రాజ్యాంగాన్నే మార్చాలని #KCR పిలుపునిచ్చినపుడు ఎక్కడ దాక్కున్నరు? BJP-RSS కూటమి దేశంలో మత విద్వేషాలు రగిలిస్తుంటే, బీసీల జనాభాగణన నిరాకరించినపుడు ఎందుకు రోడ్డెక్కలేదు?
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) February 9, 2022
మరిన్ని వార్తల కోసం: