బహుజన రాజ్యం వస్తేనే అభివృద్ధి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బహుజన రాజ్యం వస్తేనే అభివృద్ధి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌ మండలంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాత్ర కొనసాగుతోంది. శనివారం (జూన్ 17వ తేదీన) బెజ్జూర్‌ తలాయి గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిని పరిశీలించారు. ఈ ప్రాంతంలో జలవిద్యుత్ కేంద్రం నిర్మించాలనుకుంటున్న స్థలాన్ని పరిశీలించారు. నిజాం సర్కార్ కాలంలో ఏర్పాటు చేసిన జలవిద్యుత్ కేంద్రం ఆనవాళ్లు ఉన్న దిమ్మెను కూడా పరిశీలించారు.

రాష్ట్రంలో బహుజన రాజ్యం వస్తే.. తలాయిలో జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించి.. ఈ ప్రాంతంలోని రైతులకు విద్యుత్ ను అందిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే స్థానికులే పనులు చేసే విధంగా మార్పులు తెస్తామన్నారు. రానున్న రోజులలో బీఎస్పీ జెండా ఈ ప్రాంతంలో ఎగరడం ఖాయమన్నారు. దోపిడీ పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చిందన్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.