భవిష్యత్‌లో ఏ ఎన్నికల్లోనైనా ఒంటరిగానే పోటీ: మాయావతి

భవిష్యత్‌లో ఏ ఎన్నికల్లోనైనా ఒంటరిగానే పోటీ: మాయావతి

సాదారణ ఎన్నికల్లో SP,BSP పార్టీ  కలిసి పోటీ చేసినా బీజేపీ ధాటికి తట్టుకోలేక పోయాయి. ఆ తర్వాత త పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించారు  బీఎస్పీ మయావతి. తీవ్ర అంతర్మథనం పార్టీ భవిష్యత్‌ పై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లో ఏ ఎన్నికల్లోనైనా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆమె సోమవాంర ప్రకటించారు. ట్విట్టర్‌ వేదికగా పొత్తులపై తేల్చి చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీతో తెగతెంపులు అనే మాట లేకుండా పరోక్షంగా ట్వీట్లు చేశారు. 2012-2017 మధ్యలో దళితులకు, BSPకి వ్యతిరేకంగా SP పని చేసినా..ఆ గొడవను పక్కన పెట్టి ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నామని, పొత్తు ధర్మాన్ని గౌరవ ప్రదంగా నిర్వర్తించామని ఆమె ట్వీట్‌ చేశారు. పార్టీ గురించి  ఆలోచించే..రానున్న కాలంలో ఏ ఎన్నికల్లోనైనా ఒంటరిగానే పోటీ చేయడానికి సిద్దపడుతున్నట్లు ట్విట్టర్‌లో మాయావతి తెలిపారు.