
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఈ ఫస్టియర్ మేనేజ్ మెంట్ కోటా(బీ కేటగిరీ) అడ్మిషన్ల గడువును ఈ నెల 25 వరకు పొడిగించారు. ఈ మేరకు టీజీసీహెచ్ఈ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ నెల 18 వరకు అడ్మిషన్లకు గడువు ఉండగా, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అడ్మిషన్ గడువు పెంచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, బీ కేటగిరీ కింద అడ్మిట్ అయిన స్టూడెంట్ల లిస్టులను ఈ నెల 30లోగా కౌన్సిల్కు సబ్మిట్ చేయాలని ఆదేశించారు.