గూడెంలో బుద్ధపూర్ణిమ వేడుకలు

గూడెంలో బుద్ధపూర్ణిమ వేడుకలు

దండేపల్లి, వెలుగు: ప్రఖ్యాతి గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో బుద్ధ పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం పవిత్ర  బుద్ధ పూర్ణిమ నేపథ్యంలో దండేపల్లి మండలం గూడెం గోదావరి సమీపంలో గుట్టపై ఉన్న రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకొని సామూహిక వ్రతాలు ఆచరించారు. అన్నదానం, వసతి తదితర సదుపాయాలు కల్పించారు.