వెటర్నరీలో మరో 14 మంది డిప్యుటేషన్లు రద్దు : అధికారి యాకూబ్ రెడ్డి

వెటర్నరీలో మరో 14 మంది డిప్యుటేషన్లు రద్దు : అధికారి యాకూబ్ రెడ్డి

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా వెట ర్నరీ, యానిమల్​ హస్బెండరీ డిపార్ట్​మెంట్​లో మరో 14 మంది సిబ్బంది డిప్యుటేషన్లు రద్దు చేస్తూ ఆ శాఖ అధికారి యాకూబ్​ రెడ్డి ఆర్డర్స్​ జారీ చేశారు. 

ఇంతకుముందు జేడీగా ఉన్న శంకర్ విచ్చలవి డిగా డిప్యుటేషన్లు ఇచ్చి వసూళ్లకు పాల్పడ్డట్టు ఆరోపణలు రావడం, ఏసీబీ విచారణ కొనసాగుతుండడంతో ఆయన హయాంలో జరిగిన డిప్యుటేషన్లను రద్దు చేశారు. ఇటీవల శంకర్ ​భార్య విజయభారతితో పాటు మరో ఐదుగురు డిప్యుటేషన్లు క్యాన్సిల్​ చేయగా, తాజాగా 14 మంది డిప్యుటేషన్లు రద్దు చేశారు.