కౌన్సి లర్ భూమి స్వాధీనంలో కాంగ్రెస్ పాత్ర లేదు : సీనియర్ నేత అబ్దుల్ అజీజ్

కౌన్సి లర్ భూమి స్వాధీనంలో కాంగ్రెస్ పాత్ర లేదు : సీనియర్ నేత అబ్దుల్ అజీజ్
  • అకారణంగా కాకా కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నరు

కోల్​బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపల్​11వ వార్డు బీఆర్ఎస్​ కౌన్సిలర్​ బొమ్మ భూమయ్య గౌడ్​ భూమిని సింగరేణి అధికారులు స్వాధీనం చేసుకున్న అంశంలో కాకా కుటుంబానికి, కాంగ్రెస్​ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ​టౌన్ ప్రెసిడెంట్​పల్లె రాజు, సీనియర్​ నేత​ అబ్దుల్​ అజీజ్​ స్పష్టం చేశారు. శనివారం రామకృష్ణాపూర్​లోని కాంగ్రెస్​ ఆఫీస్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు. 

అధికారం ఉన్నా, లేకపోయినా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కాకా కుటుంబం పనిచేస్తోందన్నారు. బీఆర్ఎస్ ​కౌన్సిలర్ ​భూమయ్య గౌడ్​ భూమి స్వాధీనం వ్యవహారం సింగరేణి ఎస్టేట్​ఆఫీసర్లకు సంబంధించినదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి కాంగ్రెస్ పార్టీకి కానీ, లీడర్లకు కానీ ఎలాంటి సంబంధంలేదన్నారు. 

కాంగ్రెస్​ నేతలపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. కంపెనీ భూమిని అక్రమించుకున్నారని సింగరేణి ఆఫీసర్లు ఏడేనిమిదేళ్ల కిందటనే సరిహద్దు స్తంభం పాతిన విషయాన్ని స్వయాన ఆయన భార్య విజయ మీడియా ముందు వెల్లడించిన విషయాన్ని గుర్తుచేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామిపై ఇష్టారీతిన మాట్లాడితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ కౌన్సిలర్​ దాముక శీరిష,​ లీడర్లు శ్రీనివాస్, కొక్కుల సతీశ్, బత్తుల వేణు, సత్యపాల్, ​రాజేశ్, నాగుల రాజ్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు.