- ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
- రూ.3 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
కుంటాల, వెలుగు: నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని ముథోల్ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చెప్పారు. కుంటాల మండలంలోని అంబకంటిలో రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను శనివారం ఆయన ప్రారంభించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక రిపేర్లు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు తొలగించామన్నారు.
దౌనెల్లి, సూర్యపూర్ గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్లను నెల రోజుల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కుంటాల రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీడీవో వనజ, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు లింగురాం పటేల్, సర్పంచ్లు జక్కుల గజేందర్, ముజిగే రాణి, జాదవ్ జ్యోతిబాయి తదితరులు పాల్గొన్నారు.
