క్యాతనపల్లి రాళ్లదాడిలో గాయపడ్డవారు కోలుకోవాలని పూజలు : కాంగ్రెస్ నేతలు

క్యాతనపల్లి రాళ్లదాడిలో గాయపడ్డవారు కోలుకోవాలని పూజలు : కాంగ్రెస్ నేతలు

కోల్ బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపల్​చైర్​పర్సన్​ఎన్నిక సందర్భంగా రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ ​వెంకటస్వామి కాన్వాయ్​పై బాల్క సుమన్ ​తన అనుచరులతో రాళ్లదాడి చేసిన ఘటనలో గాయపడ్డ బాధితులు కోలుకోవాలని కాంగ్రెస్ ​నేతలు పూజలు చేశారు. శనివారం మందమర్రిలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో యూత్​ కాంగ్రెస్​ఆధ్వర్యంలో లీడర్లు, కార్యకర్తలు ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాళ్లదాడిలో కానిస్టేబుల్​ రాకేశ్, కాంగ్రెస్ కార్యకర్తలు జావిద్, తోకల సురేశ్ తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. 

ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు. ఇలాంటి హింసాత్మక సంఘటనలు పునరావృత్తంకాకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలని కోరారు. మందమర్రి మండల యూత్​ కాంగ్రెస్​వైస్​ ప్రెసిడెంట్ మాయ తిరుపతి, మాజీ జనరల్ సెక్రటరీ వడ్లూరి సునీల్ కుమార్, నాయకులు ఆర్.కిరణ్, ఎం.శేఖర్, జి.నరేశ్, సురేందర్, చోటు, గణేశ్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.