ఇందిరమ్మ ఇండ్ల పేరిట వసూళ్లు : కోతుల్గాం మాజీ ఎంపీటీసీ సుదీప్

ఇందిరమ్మ ఇండ్ల పేరిట వసూళ్లు : కోతుల్గాం మాజీ ఎంపీటీసీ సుదీప్
  •     చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

కుభీర్, వెలుగు: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పేరిట కొందరు పంచాయతీ సెక్రటరీలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కుభీర్​మండలం కోతుల్గాం మాజీ ఎంపీటీసీ సుదీప్ శనివారం ఎంపీడీవో గంగ సాగర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుదీప్ మాట్లాడుతూ.. మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి కొందరు పంచాయతీ సెక్రటరీలు అక్రమ వసూళ్లకు  పాల్పడుతున్నారని, విచారణ జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

జిల్లా పంచాయతీ రాజ్ అధికారికి ఇదివరకే ఫిర్యాదు చేశామని, నెలలు గడుస్తున్న ఇప్పటివరకు విచారణ జరపకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. చర్యలు చేపట్టకపోతే కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. స్పందించిన ఎంపీడీవో విచారణ జరిపి వసూళ్లకు పాల్పడిన సెక్రటరీలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.