ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (ఫిబ్రవరి 1) మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా దిగుమతి సుంకాలు, ప్రత్యక్ష , పరోక్ష పన్నులను యధాతథంగా కొనసాగిస్తామని పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. ట్యాక్స్ రిటర్న్స్ యావరేజ్ టైం ను 10 రోజులు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. 2013-14లో 93 రోజులు సగటు సమయం 2023 నాటికి 10 రోజులకు తగ్గించబడిందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. మరోవైపు ప్రజల సగటు వాస్తవ ఆదాయం 50 శాతం పెరిగిందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
కొత్త పన్నుల స్లాబ్ లు
- రూ. 3 లక్షల లోపు ఆదాయం ఉంటే పన్ను లేదు
- రూ. 3లక్షల నుంచి రూ. 6 లక్షల మధ్య ఆదాయం ఉంటే 5 శాతం పన్ను( సెక్షన్ 87A కింద పన్ను రాయితీ ఉంది )
- రూ. 6లక్షల నుంచి రూ. 9 లక్షల మధ్య ఆదాయం ఉంటే 10 శాతం పన్ను( సెక్షన్ 87A కింద రూ. 7 లక్షల వరకు పన్ను రాయితీ ఉంది )
- రూ. 9లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఆదాయం ఉంటే 15 శాతం పన్ను
- రూ. 12లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ఆదాయం ఉంటే 20 శాతం పన్ను
- రూ. 15లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం పన్ను
పాత పన్నుల స్లాబ్ లు
- రూ. 2.5 లక్షల లోపు ఆదాయం ఉంటే పన్ను లేదు
- రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉంటే 5 శాతం పన్ను
- రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షల లోపు ఆదాయం ఉంటే 20 శాతం పన్ను
- రూ. 10లక్షలు ఆపైనా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను
పాత పన్నుల విధానంలో 60 యేళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయపన్ను మినహాయింపు పరిమితి రూ. 3 లక్షల వరకు ఉంది. కానీ 80 యేళ్ల లోపు ఉన్నవారికి, 80 యేళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ. 5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. కొత్త పన్నుల రేట్లు వ్యక్తులు, సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లతోసహా అన్ని వర్గాల వారికి ఒకే విధంగా ఉంటాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.