ఈ సండే బోర్ కొడుతుందా..? ఈ రెండు సినిమాలు, ఈ వెబ్ సిరీస్లో ఒకటైనా చూడండి మరి..

ఈ సండే బోర్ కొడుతుందా..? ఈ రెండు సినిమాలు, ఈ వెబ్ సిరీస్లో ఒకటైనా చూడండి మరి..

టైటిల్: పరమ్​ సుందరి, ప్లాట్​ ఫాం : అమెజాన్ ప్రైమ్‌‌‌‌ వీడియో. డైరెక్షన్ :  తుషార్ జలోటా, కాస్ట్​ : సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్, సంజయ్ కపూర్, మన్‌‌‌‌జోత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, సిద్ధార్థ్ శంకర్

ఢిల్లీకి చెందిన పరమ్ (సిద్ధార్థ్ మల్హోత్రా) తన తండ్రి పర్మిత్ సచ్‌‌‌‌దేవ్ (సంజయ్ కపూర్) దగ్గర డబ్బులు తీసుకుని స్టార్టప్‌‌‌‌ల్లో ఇన్వెస్ట్‌‌‌‌ చేస్తుంటాడు. అలా కోట్లలో నష్టపోతాడు. చివరకు డేటింగ్ స్టార్టప్‌‌‌‌ యాప్ ‘ఫైండ్ మై సోల్ మేట్’ ఎలాగైనా సక్సెస్ అవుతుందని నమ్మి, దాని మీద ఇన్వెస్ట్‌‌‌‌ చేయాలి అనుకుంటాడు. దాంతో డబ్బు కావాలని తండ్రిని అడుగుతాడు. సచ్‌‌‌‌దేవ్‌‌‌‌ ఆ యాప్ ద్వారా తన సోల్ మేట్‌‌‌‌ని కనుక్కోవడంలో సక్సెస్‌‌‌‌ అయితేనే డబ్బు ఇస్తానంటాడు.

కట్‌‌‌‌ చేస్తే.. పరమ్‌‌‌‌ తన ఫ్రెండ్ జగ్గు(మన్ జోత్ సింగ్)తో కలిసి కేరళకు వెళ్తాడు. అక్కడ సుందరి (జాన్వీ కపూర్) అనే అమ్మాయి పేరెంట్స్ చనిపోవడంతో తన చెల్లితో కలిసి ఉంటుంది. జీవనోపాధి కోసం తన ఇంటిని హోమ్ స్టేగా మార్చుకుంటుంది. పరమ్‌‌‌‌ ఆ ఇంట్లో దిగి, ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ.. తన ప్రేమ గురించి చెప్పేలోపే ఊరి పెద్దలు సుందరికి వేణు నాయర్ (సిద్ధార్థ్ శంకర్)తో పెళ్లి నిశ్చయం చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. 

దాడి చేసిందెవరు?
టైటిల్ : అక్యూజ్డ్‌‌‌‌, ప్లాట్​ ఫాం : అమెజాన్ ప్రైమ్‌‌‌‌ వీడియో, డైరెక్షన్ :  ప్రభు శ్రీనివాస్, కాస్ట్​ : ఉదయ, అజ్మల్, జాన్విక, యోగి బాబు
కనక్కు(ఉదయ) ఒక ప్రముఖ రాజకీయ పార్టీ జిల్లా కార్యదర్శి హత్య కేసులో జైలుకి వెళ్తాడు. కేసు విచారణలో భాగంగా.. అతన్ని చెన్నైలోని పుళల్ జైలు నుంచి సేలంలో ఉన్న కోర్టుకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతో ఆ పనిని కానిస్టేబుల్ వెంధన్ (అజ్మల్)తోపాటు కొంతమంది పోలీసులకు అప్పగిస్తారు. వాళ్లంతా కలిసి కనక్కుని చెన్నై నుంచి  బస్సులో తీసుకువెళ్తుంటారు. మార్గం మధ్యలో వాళ్లపై కొంతమంది రౌడీలు దాడి చేస్తారు. కనక్కును చంపేందుకు వెంబడిస్తుంటారు. అప్పుడు వెంధన్‌‌‌‌ అతన్ని కాపాడతాడు. ఇంతకీ కనుక్కు ఎవరు? అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? తెలియాలంటే సినిమా చూడాలి. 

చివరి తొమ్మిది రోజులు
టైటిల్ : కురుక్షేత్ర పార్ట్‌‌‌‌– 2, ప్లాట్​ ఫాం : నెట్ ఫ్లిక్స్, డైరెక్షన్ :  ఉజాన్ గంగూలీ
పాండవులు, కౌరవుల మధ్య జరిగిన 18 రోజుల కురుక్షేత్ర యుద్ధాన్ని నెట్‌‌‌‌ఫ్లిక్స్ రెండు భాగాల యానిమేటెడ్‌‌‌‌ వెబ్‌‌‌‌సిరీస్‌‌‌‌గా తీసుకొచ్చింది. గతంలో రిలీజైన మొదటి భాగంలో మొదటి తొమ్మిది రోజులు  ఏం జరిగిందో చూపించారు. తొమ్మిది మంది యోధుల గురించి వివరించారు. జయద్రథుడి మరణంతో ఆ పార్ట్‌‌‌‌ పూర్తయ్యింది. రెండో భాగంలో చివరి తొమ్మిది రోజుల మహా యుద్ధాన్ని చూపించారు. 

ముఖ్యంగా పాండవులు, కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్న యోధుల భావోద్వేగాలు, అంతర్గత సంఘర్షణలు, నైతిక పోరాటాలను బాగా బ్యాలెన్స్‌‌‌‌ చేశారు. దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ చేసిన భీకర పోరాటం ఎలా సాగింది? అసలు కురుక్షేత్రం ఎలా మొదలైంది? ఎలా ముగిసింది? శ్రీకృష్ణుడు బోధించిన ధర్మ మార్గం.. లాంటివన్నీ ఈ రెండో పార్ట్‌‌‌‌లో తెలుసుకోవచ్చు.